సేనాపతి..శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు' చూసిన వారెవరికైనా గుర్తుండిపోయే పాత్ర అది. లంచగొండి తనంపై పోరాడే స్వాతంత్ర్య సమరయోధుడిగా కమల్ నటన అద్భుతంగా సాగిందా చిత్రంలో.5 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యారు కమల్‌.కమల్‌ సినీ ప్రస్థానానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు.కుటుంబ సమేతంగా సోదరుడు చారుహాసన్, కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరాహాసన్‌ తమ స్వగ్రామం పరమకుడికి ప్రయాణం అయ్యారు. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా సౌత్ ఇండియా గ్రేట్ దర్శకుడు శంకర్ తాజాగా ఆయన అభిమానులకు పుట్టిన రోజు కానుక అందించాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఇండియన్ 2' నుంచి ప్రీలుక్ ను శంకర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ నటిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.