స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘అల వైకుంఠపురములో’.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన 'సామజ వర గమన' పాట ప్రేక్షకులను అలరించింది. సామాజిక మాధ్యమాలలో రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియాగా నిలిచింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీత దర్శకుడు తమన్ అందించిన బాణీలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్‌ను ప్రస్తుతం పారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, పూజ హెగ్డేలపై చిత్రీకరిస్తున్న ఈ అందమైన గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు.ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇంకా ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్‌, సచిన్‌ ఖేడ్‌, భరణి, సునీల్‌ తదితరులు నటిస్తున్నారు.
ఛాయాగ్రహణం: పి.ఎస్‌. వినోద్‌
సంగీతం: తమన్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పిడివి.ప్రసాద్‌.