నాలుగు ప‌దులుండే హీరోలే జిమ్‌కెళ్లాలంటే ఆలోచిస్తున్న నేటి రోజుల్లో ఆరు ప‌దులు.దాటిన మెగాస్టార్ చిరంజీవి జిమ్‌లో చేస్తున్న హార్డ్ వ‌ర్క్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.దీనికోసమే ఆయన జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.తన 152వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ కొద్దిరోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీ కొరకు చిరు సన్నద్ధం అవుతున్నారు.జిమ్‌లో చిరంజీవి డంబెల్స్ ఎత్తుతోన్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 64 ఏళ్ల వయసులోనూ వృత్తి ధర్మం కోసం జిమ్‌లో కష్టపడుతోన్న చిరంజీవిని చూసైనా నేటి యువత స్ఫూర్తి పొందాలి. ప్రస్తుతం వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లిన చిరంజీవి తిరిగి రాగానే డిసెంబర్‌ మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది.