ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభిచిన చిత్రయూనిట్ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.వచ్చే ఏడాది జనవరి 15న ఈ చిత్రం విడుదల కానుందని శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.సరైన సమయంలో రిలీజ్‌ అయితే సినిమాకు మంచి టాక్‌రావటం కాయం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి సీజన్‌ మిస్‌ కావద్దని భావిస్తున్నారు యూనిట్‌. బన్నీ, మహేష్ లాంటి టాప్‌ స్టార్స్‌ బరిలో ఉన్నా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జనవరి 15న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.ఆదిత్య మ్యూజిక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై  ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటిస్తోంది.