మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘మామాంగం’ – హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్ .ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి కేర‌ళ సంప్రాదాయ యుద్ధ‌వీరుడిగా క‌నిపించ‌నున్నారు.మమ్ముట్టిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు విజయవంతమైన ఎన్నో వైవిధ్యభరితమైన కథా  చిత్రాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి.కావ్య ఫిలింస్ బ్యానర్‌పై వేణు కున్నప్పిల్లి నిర్మాణంలో, ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదల చేశారు.250 ఏళ్ల నాటి చారిత్రత్మక కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీలో మమ్ముట్టితో పాటు ఉన్నిముకుందన్  ప్రాచీ తెహ్లాన్ అను సితార ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్ లో అసక్తికర సన్నివేశాలతో ఉద్వేగభరితంగా ఉంది.భరతాపుళ ఒడ్డున పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఐకానిక్ పండుగ నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ట‌.ఈ చిత్రాన్ని నవంబర్ 21 న తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుందని భావిస్తున్నారు.
కెమెరా : మనోజ్ పిళ్లై
సంగీతం : ఎమ్.జయచంద్రన్
బ్యాగ్రౌండ్ స్కోర్ : సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
ఎడిటింగ్ : రాజా మొహమ్మద్.