ప్రముఖ నిర్మాత లక్ష్మణ్(దిల్ రాజు పార్టనర్) కుమారుడు ఉజ్వల్ ఎంగేజ్ మెంట్ నవంబర్17 న మనీషా తో హైదరాబాద్ లోని గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో దిల్ రాజు,శిరీష్,హీరోలు ప్రభాస్, విజయదేవర కొండ,మంత్రి వర్యులు హరీష్ రావు,రేవంత్ రెడ్డి, డైరెక్టర్ వి.వి.వినాయక్,సుకుమార్,వంశీ పైడిపల్లి,హరీష్ శంకర్,నమ్రత శిరోద్కర్,లతో పాటు పలువురు సినీ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.