చదువుకోవడానికి స్థోమత లేక మధ్యలోనే చదువు వదిలేస్తున్న చిన్న పిల్లల సహాయార్ధం టాలీవుడ్ నటులు అమెరికాలోని ప్రవాస భారతీయులతో క్రికెట్ మ్యాచ్ ఈ ఆగస్టు 17న అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులైన హీరో తరుణ్,శ్రీకాంత్,సందీప్ కిషన్,పృధ్వి మీడియా ముఖంగా తెలియాజేశారు. ఈ ఈవెంట్ ని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ సంస్థ అధినేత వర ప్రసాద్ నిర్వహించడం జరుగుతుంది.

ఈ సందర్భంగా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వరప్రసాద్ తో నెక్స్ట్ 5ఇయర్స్ వరకు ప్రతి ఏటా ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఈ మ్యాచెస్ ను ఆడటానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూపాల్, సుదీర్ బాబు, ఖయ్యుమ్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫణి లు పాల్గొన్నారు.