సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబుపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనమైంది. ఆయన కు చెందిన రామానాయుడు స్టూడియోస్ సహా కార్యాలయాల పైనా ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. నేటి ఉదయం నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో రామానాయుడు స్టూడియోస్ కార్యాలయం లో పలు డాక్యుమెంట్లను పరిశీలించారు.ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ధియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కంగారుపడుతున్నారు.