గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ  మొక్కలను నాటారు.తమిళ నటుడు రజనీకాంత్, తెలుగు నటులు వెంకటేశ్, పవన్‌ కళ్యాణ్‌కు సవాలు విసిరారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సినిమా ఇండస్ట్రీకి వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో చాలా మంది సినిమా, టీవీ నటులు భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా చేరారు.త్వరలోనే ఇది 10 కోట్ల మొక్కలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ ఛాలెంజ్ లో భాగంగా కృష్ణ తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు.