టాలీవుడ్ సినీ వర్గాల్లో ఈరోజు ఉదయం సంచలనం రేగిన సంగతి అందరికి తెలిసిందే.ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు ఇంట్లో సహా ఆయనకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ వారు ఆకస్మిక దాడులు చెయ్యడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.అయితే అదే సమయంలో హీరో నాని ఆఫీసుపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. తెల్లవారు జామునే నాని ఆఫీస్‌కి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. హీరోగా మంచి ఫాంలో ఉన్న నాని ఇటీవల నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. వాల్ పోస్టర్‌ బ్యానర్‌ను స్థాపించిన నాని అ! సినిమాను నిర్మించాడు.రెండో ప్రయత్నంగా ఫలక్‌నుమా దాస్‌ ఫేం విశ్వక్‌సేన్‌ హీరోగా ఓ సినిమాను ప్రకటించాడు. మరి కొన్ని ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వి’ చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ నేపథ్యంలో నాని ఇంటిపై ఐటీ దాడులు జరగటం ఆసక్తికరంగా మారింది.