యువ నటుడు నిఖిల్ నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’ ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ ఎల్‌ పి పతాకంపై రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.నిఖిల్ జర్నలిస్ట్ గా చేసిన అర్జున్ సురవరం అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. మొదట్లో ముద్ర అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రాన్ని తరువాత అర్జున్ సురవరం గా మార్చారు.కాగా నిన్న ఈ చిత్ర థియరిటికల్ ట్రైలర్ విదుల చేశారు.ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్న నిఖిల్‌.. నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసే ఓ ముఠా గుట్టురట్టు చేసినట్లు కనిపిస్తోంది. దీంతో అతడు ఎదుర్కొనే సమస్యలు, కోల్పోయే ప్రేమ, మర్యాద, ప్రత్యర్థులపై తీసుకునే రివేంజ్‌ ఇలా అన్ని కలగలిపి సినిమాకు సంబంధించి ప్రధాన అంశాలను ట్రైలర్‌ రూపంలో చూపించారు.సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు. కాగా ఈ మూవీలో నిఖిల్..లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ చిత్రాన్ని సంతోష్ తెరకెక్కిస్తున్నాడు.