దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’.రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటిస్తోంది.ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి 'ఒలివియా మోరిస్' నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. 'రే స్టీవన్ సన్' ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. 'ది థీరీ ఆఫ్ ఫ్లైట్' ద్వారా ఈ నటుడు సినిమాల్లో అరంగేట్రం చేశాడు. తర్వాత 'పనిషర్ వార్ జోన్' మంచి బ్రేక్ ని ఇచ్చింది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 10 భాషల్లో వచ్చే ఏడాది  జూలై 30న విడుదల కానుంది.