మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం నేటితో 50 రోజుల పూర్తి చేసుకుంది.చిరంజీవి తనయుడు  రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన  ఈ మూవీ  బాక్సాఫీస్ దగ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఈ  చిత్రంలో చిరంజీవి నటన   అద్భుతం ఆయ‌న చెప్పే డైలాగ్స్‌, యాక్ష‌న్ సీన్స్ లో చిరు న‌ట ప్ర‌ద‌ర్శ‌న సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా అనేక చోట్ల నాన్ బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నిన్నటితో 50 రోజులను పూర్తి చేసుకుంది. 30 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకోవడం విశేషం.అమిత్ త్రివేది అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువ‌లు, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, గ్రాండ్ విజువ‌ల్స్ సినీ ప్రేక్ష‌కుల‌కి ఎంతో ఆహ్ల‌దాన్ని పంచాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌ళం మెగా అభిమానుల ఆనందాన్ని మ‌రో మెట్టు ఎక్కేలా చేసింది.ఈ సందర్భంగా మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన సినీ కేంద్రాల్లో అర్థశతదినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.