యంగ్ హీరో కార్తికేయ మరో రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నాడు.కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన చిత్రం "90ML".నేహా సోలంకి కథానాయిక శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌, సాంగ్స్‌ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఈ  చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేసి మూవీపై భారీ అంచ‌నాలు పెంచారు.ఇటీవల గ్యాంగ్‌ లీడర్ సినిమాతో ప్రతినాయక పాత్రలో సక్సెస్‌ అయిన ఈ యంగ్ హీరో ‘90 ఎంఎల్‌’పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. లవ్..యాక్షన్ ..ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.ఈ చిత్రంలో రావు రమేష్, రవి కిషన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.