'పునాది రాళ్లు' దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడి వైద్య ఖర్చులకు కూడా భారమైన పరిస్థితుల్లో ఉన్నారు. వైద్యం చేయించుకునేందుకు కూడా డ‌బ్బు ఆయ‌న ద‌గ్గ‌ర లేక‌పోవ‌డంతో ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఆయ‌న‌కి త‌మ‌కి తోచినంత సాయం చేస్తున్నారు. తాజాగా ఇస్మార్ట్ డైరెక్ట‌ర్  పూరి జగన్నాధ్ వెంటనే తన అసిస్టెంట్ తో 50 వేల రూపాయలను పంపించినట్లుగా తెలుస్తోంది. మెహర్‌ రమేష్‌ రూ.10 వేలు, కాశీవిశ్వనాథ్‌ రూ.5 వేలు చొప్పున గూడ‌పాటి రాజ్‌కుమార్ ఆర్థిక సహాయం అందించారు.ప్రసాద్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్టనర్ సురేష్‌రెడ్డి రూ.41 వేల సాయంను రాజ్ కుమార్ కు అందించారు.వారి స్పందనకు రాజ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేల నగదు అందజేశారు.