నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రూలర్'. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.వీటికి సంబంధించిన లుక్స్‌ ఇప్పటికే విడుదల చేశారు.వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.ధర్మ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య మరో మారు వీరవిహారం చేయనున్నాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. పోలీస్ గా మరియు బిజినెస్ మాన్ గా రెండు భిన్న పాత్రలలో బాలకృష్ణ కనిపించడం విశేషం. బాలయ్య అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఉన్నాయి. ఇంటెన్స్ సీన్స్.. ఫైట్లు.. రొమాన్స్.. కామెడీ.. ఇలా అన్నీ అంశాలతో తెరకెక్కించిన సినిమాలా ఉంది. ప్రొడక్షన్ రిచ్ గా కనిపిస్తోంది.  ఇక తారాగణం కూడా భారీగానే ఉంది.వచ్చే నెల 20న క్రిస్మస్ కానుకగా రూలర్ విడుదల అవుతుంది.సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో జయసుధ, ప్రకాష్‌రాజ్‌, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు.