వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్‌ రవీందర్‌(బాబీ) తెరకెక్కించిన చిత్రం ‘వెంకీమామ’.నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది ‘వెంకీమామ’ చిత్రబృందం.ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ విడుదల కాగా మంచి ఆదరణ దక్కించుకున్నాయి. కాగా నేడు చిత్ర యూనిట్ నాగ చైతన్య పాత్రపై ఓ అనౌన్స్మెంట్ చేశారు.ఈ నెల 23న నాగచైతన్య పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు..చైతూ ఆర్మీ కెప్టెన్ కార్తీక్ గా చేస్తున్న నేపథ్యంలో అతనిలోని దేశభక్తిని తెలిపేదిగా ఈ వీడియో ఉండనుంది. ఐతే అది సన్నివేశమా, సాంగా అనే విషయం పై స్పష్టత ఇవ్వలేదు.సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకునే ఆహ్లాదకరమైన ఎపిసోడ్స్, కామెడీ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టయినర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.