యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ సరిలేరు నీకెవ్వరు టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.టీజర్ లో ఆర్మీ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే భయపడే వాడే బేరాలకువస్తాడు…. అలాంటి బేరాలు మనదగ్గర లేవమ్మా అంటూ మహేష్ చెప్పిన డైలాగ్, గాయం విలువ తెలిసిన వాడే సాయానికి వస్తాడు అంటూ విజయశాంతి డైలాగ్ అదిరేలా ఉన్నాయి.మహేష్ బాబు లుక్ అండ్ గెటప్, అనిల్ రావిపూడి టేకింగ్ అండ్ టైమింగ్ టీజర్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, బర్త్‌డే టీజర్‌, టైటిల్‌ సాంగ్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్‌ చేసిన 1.26 నిమిషాల నిడివి గల టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. దిల్‌ రాజు, మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.