కమేడియన్  శ్రీనివాసరెడ్డి  దర్శకుడు, నిర్మాతగా  చేస్తున్న తొలి చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’.వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటోంది.తాజాగా ట్రైలర్ వీక్షించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎఎస్.రాజమౌళి శ్రీనివాస్ రెడ్డికి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు.నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు శ్రీనివాస్ రెడ్డి మంచి కమెడియన్ గా తెలుసు. దర్శకుడు, నిర్మాతగానూ ప్రయాణం మొదలుపెట్టిన ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను' అని ట్వీట్ చేశారు.ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదలకానుంది.