ఎన‌భైల‌ నాటి తార‌లంతా ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ప్ర‌తియేటా వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే.అలాగే ఈ సారి కూడా 80స్ స్టార్స్ అంతా కలిసి పండగ చేసుకున్నారు. నిన్న చిరంజీవి నివాసం వేదికగా ఈ పార్టీ గ్రాండ్‌గా జరిగింది.1980లలో నటించిన స్టార్స్‌ ప్రతీ ఏడాది సరదాగా కలసి రీయూనియన్‌ జరుపుకుంటారు. ఈ ఏడాది పదో యానివర్సరీని చిరంజీవి హోస్ట్‌ చేశారు. ఈ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో జరిగింది. ఈ రీయూనియ‌న్ మీట్‌లో ఈసారి 1980-1990లోని అగ్ర తార‌లు పాల్గొన్నారు.ప్రతీ ఏడాది జరిగే పార్టీకి ఓ డ్రెస్‌కోడ్‌ ఉంటుంది. ఈ ఏడాది డ్రెస్‌ కోడ్‌ బ్లాక్, గోల్డ్‌ కలర్స్‌ అందరూ అదే రంగు దుస్తుల్లో హాజరయ్యారు.బాలీవుడ్, టాలీవుడ్ - కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.ఆయన కోరికపై తారలంతా హైదరాబాద్‌ చిరు ఇంటికి తరలివచ్చారు. వీరిలో వెంకటేష్‌, నాగార్జున, జగపతిబాబు, సుమన్‌, జయప్రద, నరేష్‌, సురేష్‌, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసినీ, సుమలత, రాధ, లిజీ, పూర్ణిమ, భాగ్యరాజ్‌, జాకీష్రాఫ్‌, రెహమాన్‌, మోహన్‌లాల్‌, రాధిక, ప్రభు, భానుచందర్‌, శరత్‌కుమార్‌ తదితర తారలంతా చిరంజీవి నివాసంలో జరిగిన వేడుకలో పాల్గొన్నారు.