విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా రాబోతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’.రీసెంట్‌గా విడుద‌లైన  హీరో  విజ‌య్ దేవ‌ర‌కొండ  ఫ‌స్ట్‌లుక్ డిఫ‌రెంట్‌గా  ఉంద‌నే టాక్ వ‌చ్చింది.క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమా ను కెఎ వల్లభ నిర్మిస్తున్నారు. కె యస్ రామారావు ఈ చిత్రానికి సమర్పకుడి గా వ్యవహరిస్తున్నారు.ఓ షెడ్యూల్‌ మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు మొదలయ్యాయి.తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్.క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రేమికుల దినోత్స‌వమైన ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క.. నిర్మాత‌లు ప్లాన్ చేశారు.మరి ఈ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో విజయ్ దేవరకొండ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.