క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న కృష్ణవంశీ గత కొంతకాలంగా బాగా వెనకబడిపోయారు. 2007లో వచ్చిన ‘చందమామ’ సినిమా తరవాత కృష్ణవంశీ ఆ స్థాయి హిట్టు అందుకోలేదు.నక్షత్ర సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని దర్శకుడు కృష్ణవంశీ రూపొందిస్తున్న మూవీ రంగ మార్తండ.నటసామ్రాట్ అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేయబోతున్నరు.నటసామ్రాట్ మరాఠీలో మంచి విజయం సాధించడంతో పాటు జాతీయ స్థాయిలో అవార్డులను కూడా గెలుచుకుంది.ఈ చిత్రం యొక్క అధికారిక ప్రారంభ పూజా కార్యక్రమం, ఈ రోజు హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది.కృష్ణవంశీ చిరకాల మిత్రుడు, దర్శకుడు తేజ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.‘రంగమార్తాండ’లో రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా మరో ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందంను తీసుకున్నారు కృష్ణవంశీ.ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు.‘రంగమార్తాండ’కు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు.