యువహీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్ రూపొందుతుందని, సందీప్ కిషన్ సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారని బలమైన వార్తలు వచ్చాయి.గతంలో కూడా దర్శకుడు తేజ.. ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఈ వార్త వైరల్ కావడంతో తాజాగా సందీప్ కిషన్ స్పందించాడు.తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు. `ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో నేను నటిస్తున్నట్టు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నన్నెవరూ ఇంతవరకు సంప్రదించలేదు.అంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు సందీప్‌ కిషన్‌.‘చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే’ చిత్రాలతో చిన్న వయసులోనే అత్యంత వేగంగా స్టార్ స్టేటస్ అందుకున్న హీరో ఉదయ్ కిరణ్.ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.