పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై  పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం `మేరా దోస్త్`. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునిఈ నెల  6న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. 
ఈ కార్యక్రమంలో చిత్ర  నిర్మాత పి.వీరా రెడ్డి  మాట్లాడుతూ ...``సినిమా అంతా  కంప్లీట్ అయ్యింది. ఈ నెల  6న దాదాపు 150 థియేటర్స్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. సినిమా పట్ల మా టీమ్ అంతా ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. స్టోరీ, చిన్నా  గారి మ్యూజిక్ మా సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది`` అన్నారు. 
  డైరెక్టర్ జి. మురళి మాట్లాడుతూ...``నిర్మాత   ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. సినిమా ప్రమోషన్, రిలీజ్  కూడా చాలా  గ్రాండ్ గా చేస్తున్నారు.   ప్రేమ , ఫ్రెండ్ షిప్ తో పాటు ఫామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి.  ఈ నెల6న సినిమా రిలీజ్. మా ప్రయత్నాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా ``అన్నారు. 
హీరోయిన్ శైలజ మాట్లాడుతూ...``ఇందులో నేను  పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర  చేశాను. డిసెంబర్ 6 న సినిమా  వస్తుంది. లవ్, ఫ్రెండ్ షిప్, ఫామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ  చూసి బ్లెస్ చేయండి `` అన్నారు. 
 కాశీవిశ్వనాధ్ , బెనర్జీ, అమిత్, వీరారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ : చిన్న; ఎడిటర్ : నందమూరి హరి; కెమెరా: సుధీర్; నిర్మాత: పి. వీరారెడ్డి; డైరెక్టర్: జి.మురళి.