కాశ్మీర్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ' మిస్టర్ కిల్లర్'
రమేష్‌ స్టూడియోస్‌, శ్రీనిక్షిత ప్రొడక్షన్స్‌ పతాకాలపై చార్లెస్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్‌ తుమ్మలపల్లి నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మిస్టర్‌ కిల్లర్‌'. విశ్వ, కృష్ణ కురుప్‌, బ్రహ్మానందం, గిరిధర్‌, నరేన్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కాశ్మీర్‌లో  పూర్తి చేసుకుంది. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నటుడు అల్లరి నరేష్‌ విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగష్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ మాట్లాడుతూ - ''మిస్టర్‌ కిల్లర్‌' తెలుగు. తమిళ భాషలలో రూపొందిన సినిమా. త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ప్రొడ్యూసర్‌ రమేష్‌గారు, అలాగే హీరోగా విశ్వ, కృష్ణ కురుప్‌లు నటించడం జరిగింది. కథ, దర్శకత్వం చార్లెస్‌. ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రొడ్యూసర్‌గా రమేష్‌గారికి, దర్శకుడికి, ఆర్టిస్టులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే ఎంటైర్‌ టీంకి అల్‌ ది బెస్ట్‌'' అన్నారు. 
విశ్వ, కృష్ణ కురుప్‌, బ్రహ్మానందం, గిరిధర్‌, నరేష్‌ పధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలమురుగన్‌, ఎడిటర్‌: బి.ప్రవీణ్‌, మ్యూజిక్‌: వేద్‌ శంకర్‌ సుగవనం, సింగర్స్‌: దామిని భట్ల, ధనుంజయ్‌, నిర్మాతలు: రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ  శ్రవణ్‌ తుమ్మలపల్లి, కథ, దర్శకత్వం: చార్లెస్‌