స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ బేనర్లపై తెర‌కెక్కిన చిత్రం ఓ బేబీ. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు.

జూలై 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రానా సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓ బేబీ' సినిమా ఎంత పెద్ద హిట్టయిదో చెప్పక్కర్లేదు. నేను వీకెండ్స్ సమయంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులకు ఫోన్ చేసి కలెక్షన్లు కనుక్కుంటూ ఉంటాను. వాళ్లు నెంబర్లు చెబుతున్నపుడు... సాధారణంగా మీ బేనర్ నుంచి వచ్చే సినిమాల కంటే చాలా బాగా ఆడేస్తుందని చెప్పారు.. అని రానా వెల్లడించారు.

ఈ సినిమా చూడగానే కొందరు నన్ను పట్టుకుని ఏడ్చేశారు. కొందరు మా అమ్మ కనిపించిందండీ, మా నాయనమ్మ కనిపించిందంటూ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ నాతో పంచుకుంటున్నారు. సినిమా బావుంది, బాగా తీశారు, పలానా వారు బాగా చేశారు అంటే థాంక్సూ అని చెప్పేదాన్ని. వారి జీవితాల గురించి, ఎక్స్ పీరియన్స్ గురించి చెబుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. మా టీం మొత్తం తరుపున ఆడియన్స్‌కు హృదయ పూర్వక నమస్కారం పెడుతున్నాను. మాకు మళ్లీ లైఫ్‌లో ఇలాంటి ఎక్స్ పీరియన్స్ వస్తుందో లేదో తెలియదు...అని దర్శకురాలు నందినీరెడ్డి తెలిపారు.