నటీనటులు :  రాజ్ తరుణ్, షాలిని పాండే, రాజా,నాజర్, భరత్ తదితరులు

దర్శకత్వం : జి ఆర్ కృష్ణ

నిర్మాత‌లు : శిరీష్

సంగీతం :  మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో మంచి ఊపు మీద కనిపించి.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ట్రాక్ తప్పిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్. కొంచెం గ్యాప్ తర్వాత అతను ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకుముందు రాజ్ తో ‘లవర్’ నిర్మించిన దిల్ రాజే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. జీఆర్ కృష్ణ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

మహి (రాజ్‌తరుణ్‌) ఓ ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్‌. తాతా (నాజర్‌) కోరిక మేరకు వర్ష (షాలినీ పాండే) సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ దశలో మహితో వర్షకు పరిచయం ఏర్పడుతుంది.  అయితే వీరిద్దరి పరిచయం ఇప్పడిది కాదని చిన్ననాటిదని తెలుసుకుంటారు. అంతేకాకుండా మహి ప్రోద్బలంతో వర్ష హీరోయిన్‌ అవుతుంది. అంతేకాకుండా చిన్నతనం నుంచే ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమలో పడతారు. అయితే అప్పటికే రాహుల్‌(రాజు సిరివెన్నెల) అనే వ్యక్తితో పెళ్లికి రెడీ అయిన వర్ష, మహితో ప్రేమపై ఎటూ తెల్చుకోలేకపోతుంది. మరోవైపు మహి తీవ్ర గుండెజబ్బుతో భాదపడుతున్న విషయం కూడా తెలుస్తోంది. చివరకి వర్ష, మహిలు ఒక్కటయ్యారా? చిన్న తనం నుంచి వీరి ప్రేమ ప్రయాణంలో ఎదురైన సమస్యలేంటివి? వీరిద్దరి లోకం ఒకటే ఎలా అయింది? అనేదే మిగతా కథ. 


విశ్లేషణ:

సినిమాలో ప్రారంభం నుండి క్లైమాక్స్ వ‌ర‌కు బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీలా సాగుతుంది. ఎక్క‌డా గంద‌ర‌గోళం క‌న‌ప‌డ‌దు. ల‌వ్‌స్టోరీ అన్న త‌ర్వాత మెయిన్ లీడ్ మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ ఆక‌ట్టుకునేలా ఉండాలి. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు కృష్ణ ఆ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గానే డీల్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్ త‌రుణ్ అంటే ఓ త‌ర‌హా యాస ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ క‌న‌ప‌డ‌దు. ఓ కొత్త రాజ్ త‌రుణ్ క‌న‌ప‌డ్డాడు అనే చెప్పాలి. ఓ ర‌కంగా చెప్పాలంటే సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. సినిమా సైలెంట్‌గా ర‌న్ అవుతూనే ఉంటుంది కానీ.. ఓ ఫీల్ గుడ్ ఎమోష‌న్ ర‌న్ అవుతుంటుంది. హీరో, హీరోయిన్ పాత్ర‌ల‌ను డిజైన్ చేసిన తీరు బావుంది. ఎక్క‌డా ఓవ‌ర్ డోస్‌గా అనిపించ‌దు. ఇక చివ‌రి ముప్పై నిమిషాలు చాలా కీల‌కం. సినిమాలో హీరో అనుకోకుండా వ‌చ్చిన స‌మ‌స్య దానికి హీరోయిన్ కార‌ణంగా దొరికిన స‌మాధానం .. కొత్త‌గానే ఉంది. ట‌ర్కీష్ సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ జాగ్ర‌త్త‌గా హ్యాండిల్ చేశాడు. హీరో త‌న ల‌వ్‌ను ఎక్స్‌ప్రెస్ చేసే సంద‌ర్భాలు.. అవి హీరోయిన్ విన‌క‌పోవ‌డం.. మ‌రో ప‌క్క హీరోయిన్ హీరోను ప్రేమిస్తుండ‌టం వంటి స‌న్నివేశాల‌తో సినిమా ప్రీ క్లైమాక్స్‌కి చేరుకుంటుంది. అక్క‌డ నుండి సినిమా మ‌రింత ఎమోష‌న్‌గా మారుతుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం, నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లం. ఇక స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీతో ప్ర‌తి సన్నివేశాన్ని విజ‌వల్‌గా రిచ్‌గా చూపించారు. సినిమా లెంగ్త్ ఎక్కువ‌గా లేదు. సినిమా కూల్‌గా సాగేపోయే ల‌వ్‌స్టోరీ. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్ప‌లేం ..అనే సంద‌ర్భంలో చేసిన ఈ సినిమాలో ల‌వ్‌లోని బ‌ల‌మైన ఎమోష‌న్స్‌ను క్యూట్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులకు సినిమా స్లో అనిపించొచ్చు. ఫ‌స్టాఫ్‌లోని కొన్ని సీన్స్ సాగ‌దీత‌గా అనిపిస్తాయి.