కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం.6గా  అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `వైల్డ్ డాగ్‌`. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. డిఫ‌రెంట్‌గా ఉన్న నాగార్జున్ లుక్ రీసెంట్‌గా జ‌రిగిన దిశ హంత‌కుల‌ ఎన్‌కౌంట‌ర్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారని ఫ‌స్ట్ లుక్‌లోని న్యూస్ పేప‌ర్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది.
జాతీయ ప‌త్రిక‌లో రాసిన వార్త‌ల సారాంశం ఆధారంగా అస‌లు సినిమా ప్ర‌ధాన క‌థాంశం ఏంటో అర్థ‌మ‌వుతుంది. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన వైల్డ్‌డాగ్ విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో అక్కినేని నాగార్జున న‌టిస్తున్నారు.
మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాశారు. షానియ‌ల్ డియో సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

కింగ్ నాగార్జున హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి ,
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్ సాల్మోన్‌
నిర్మాత‌లు:  నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
స‌హ నిర్మాత‌లు:  ఎన్‌.ఎమ్‌.పాషా, జ‌గ‌న్ మోహ‌న్ వంచ‌
సినిమాటోగ్ర‌ఫీ:  షానియ‌ల్ డియో
యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌:  డేవిడ్ ఇస్మాలోనె
డైలాగ్స్‌:  కిర‌ణ్ కుమార్
ఎడిట‌ర్‌: శ‌్ర‌వ‌ణ్ కేతికానేని
ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌: స‌తీష్‌, ప్ర‌శాంత్‌
ఆర్‌:  ముర‌ళి ఎస్‌.వి
వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌.టి
కాస్ట్యూమ్స్‌:  అశ్వంత్ బైరి
స్టంట్ కో ఆర్టినేట‌ర్‌:  జాషువా
బ్లిసిటీ డిజైన‌ర్‌:  అనిల్ భాను