యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`.ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అందులో భాగంగా నాగ‌శౌర్య సినిమా డ‌బ్బింగ్ స్టార్ట్ చేశాడు. ఈ చిత్రంలో మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా  ఈ చిత్రం కొన్ని యథార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించారు.ఇక రీసెంట్ గా ఈ చిత్రం టీజర్‌ ను విడుదల అయిన సంగతి తెలిసిందే. అత్యంత గ్రిప్పింగ్ గా ఉన్న ఈ టీజర్ కు ప్రేక్షుకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది.అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జ‌న‌వ‌రి 31న విడుదల చేయ‌బోతున్నారు.