దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు.అగ‌స్త్య మంజు ద‌ర్శ‌క‌త్వం  వ‌హించిన చిత్రం `బ్యూటిఫుల్‌`.ఈ సినిమా  జ‌న‌వ‌రి 1న  విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రంలో  సూరి, నైనా గంగూలి జంట‌గా న‌టించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో వ‌ర్మ చాలా బిజీగా ఉంటున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ నైనా గంగూలీతో డ్యాన్స్ చేశాడు. అభిమానులు, ప‌లువురు సినీ ప్రేక్ష‌కులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో అంద‌రూ చూస్తుండ‌గానే వ‌ర్మ‌, నైనా కాళ్లు ప‌ట్టుకున్నాడు. వ‌ర్మ ప‌నికి నైనా ఒక్క‌సారిగా షాక్‌కు గురయ్యారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.