కొత్తవారికి సినీ ఇండ‌స్ట్రీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలో అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా 1979 లో సాగే పీరియాడిక్ మూవీ రూపొందుతుంది. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పృథ్వీ పిన్న‌మరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డా.కె.ర‌వికిర‌ణ్ స‌మ‌ర్ప‌ణ‌లో బైట్ ఫీచ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో విశ్వ‌క్ కందెరావ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 

న‌టీన‌టులు:
నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  విశ్వ‌క్ కందెరావ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆదిత్య జ‌వ్వాది
ఎడిటింగ్‌: ర‌వితేజ గిరిజాల‌
మ్యూజిక్‌: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహారి
సౌండ్ డిజైన్‌:  నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి, ధ‌నుష్ న‌య‌నార్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా