*అమరావతి రాజధానిలో వైకుంటపురం అనే అందమైన గ్రామంలో నిర్మించిన చిత్రమే "అన్నపూర్ణమ్మ గారి మనవడు"ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్ర  విశేషాలను* 

 *దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ* :-సంవత్సరం ప్రారంభంలో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఒక మంచి కథతో పాటు  మంచి కథనంతో సాగే ఈ కథలో ఎన్నో పాత్రలు పాత్రలు ప్రవహిస్తుంటాయి, గ్రామంలో ఉండే ప్రతి గడపలో అందరూ పిన్ని,బాబాయ్,అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లెల్లు అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. మా దర్శకులు నర్రా శివ నాగేశ్వరరావు ఆప్యాయత అనురాగాలతో గుండెల్ని పిండేసే సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, యూత్ ని అలరించే అమృత,ప్రణయ్ ల ప్రేమకథలో వాస్తవాలతో అన్నపూర్ణమ్మ గారి మనవడు అందరినీ అలరిస్తాడు.
శతమానం భవతి తరువాత మళ్ళీ ఒక మంచి చిత్రాన్ని చూసాము అని   
అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రాన్ని  ప్రశంశించి ,దర్శకుడిగా పడికాలాలపాటు గుర్తుండి పోయే ఒక మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడు శివనాగేశ్వర్ రావు అని నన్ను అభినందించి మా చిత్రానికి  'u"క్లీన్ సర్టిఫికెట్. ఇచ్చిన సెన్సార్ సబ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు దర్శకులు శివనాగేశ్వరరావు.సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటన ఈ చిత్రానికి హైలెట్ అనే,అర్చన,బాలదిత్యలు హీరో, హీరోయిన్ లుగా నటించారని,మహానటి జమున గారు ఒక కీలక పాత్రలో నటించడం సంతోషంగా ఉందనీ,బెనర్జి, రఘుబాబు,కారుమంచి రఘు,తాగుబోతు రమేష్,సుమన్
శెట్టి,శ్రీ లక్ష్మి, సుధ,జయవాణి వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారనీ,సంగీత దర్శకుడు రాజకీరణ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరో హైలెట్ అనీ ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని mnr చౌదరి తెలిపారు...