స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ రోజు సెన్సార్ స్క్రీనింగ్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది.ఇక ఈ సినిమా రన్ టైమ్ 156 నిముషాలుగా లాక్ అయింది. అంటే రెండు గంటల ముప్పై ఆరు నిముషాలు.  సహజంగా త్రివిక్రమ్ సినిమాల రన్ టైం కాస్త ఎక్కువగానే ఉంటుంది.  అయితే మరీ లెంగ్తీ కాకుండా ఈ సినిమా రన్ టైమ్ ను త్రివిక్రమ్ టీమ్ కుదించారు అనుకోవచ్చు.సెన్సార్ పూర్తయింది కాబట్టి రిలీజ్ కు సినిమా రెడీ అయింది. ఇక ప్రమోషన్స్ లో 'అల వైకుంఠపురములో' టీమ్ మరింత జోరు చూపించడం ఖాయం.ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  టబు.. జయరాం.. సముద్రకని.. సుశాంత్.. నవదీప్.. సునీల్.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.