తమిళంలో వచ్చిన  ’96’  సినిమాకి   రీమేక్ గా తెలుగులో జాను అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో యంగ్‌ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ సమంత జోడీ కడుతున్నారు. చిత్రయూనిట్‌ మంగళవారం ‘జాను’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.కాగా తమిళంలో దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగులోనూ డైరెక్షన్‌ చేస్తున్నాడు.ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో సినిమా విడుదలని కన్ఫర్మ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమిళ సంగీత దర్శకుడు గోవింద వసంత సంగీతమందిస్తున్నాడు.మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.