గురు సినిమాతో దర్శకురాలిగా ఆకట్టుకున్న సుధా కొంగర దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా' ఈ  చిత్రంలో  నటుడు సూర్య  పైలెట్  ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. సూర్య సొంత బ్యానర్  2డీ ఎంటర్ టైన్ మెంట్స్‌పై  ఈ మూవీ రూపొందుతోంది.ఇక హీరో సూర్యకు తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే ఆయన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంటుంది. తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఇందులో ఓ కీలకపాత్ర చేయడం జరిగింది.వరుస ఫ్లాపుల్లో ఉన్న  సూర్య ఈ మూవీతో హిట్ దక్కించుకుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.