యాంకర్ గా అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వేరే చెప్పక్కర్లేదు. జబర్దస్త్ తో ఫేమస్ అయి.. ‘రంగస్థలం’ సినిమాతో ఆ క్రేజ్ ని రెట్టింపు చేసుకొని సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా ఆకట్టుకుని నటిగా ఫుల్ బిజీ అయిన అనసూయ మరో కొత్త అవతారం ఎత్తబోతుందట. తాను నిర్మాతగా మారబోతున్నట్లు అనసూయ తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైన అనసూయ, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో తాను కూడా సినిమాలను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే అనసూయ భవిష్యతులో తన ఆలోచనను అమలు పరుస్తోందా లేక ప్రస్తుతం ఏదైనా సినిమాని ప్లాన్ చేస్తుందా అనేది చూడాలి.