సుశాంత్‌ హీరోగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రం గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రవిశంకర్‌ శాస్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాతలు. మీనాక్షీ చౌదరి కథానాయికగా పరిచయమవుతున్నారు.తొలి సన్నివేశానికి వెంకటరత్నం కెమెరా స్విచాన్‌ చేయగా, యోగేశ్వరమ్మ క్లాప్‌ ఇచ్చారు. నాగసుశీల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సుశాంత్‌ మాట్లాడుతూ– ‘‘కొత్తరకం సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో కూడా కొత్తదనం ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలను. దర్శన్‌ మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేశారు’’ అన్నారు.ఈ ఏడాది అల వైకుంఠ పురములో చిత్రంతో మంచి ఆరంభం దొరికింది. చిలసౌ సినిమా ముందే విన్న కథ ఇది. కొత్తగా ఉంటుంది. అన్నారు.నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ ఇవాళ సినిమా రంగంలో కొత్త తరహా కథలు వస్తున్నాయి. మనం కొత్త దశాబ్దిలో అడుగుపెట్టాం. చేయబోయే సినిమా తప్పకుండా ఈ దశాబ్దం గుర్తుండేలా ఉండాలి. అలాంటి కథతోనే మీ ముందుకు వస్తున్నాం. సుశాంత్‌కు కథలపై మంచి పట్టు ఉంది. కథలో లోటుపాట్లుంటే వెంటనే చెప్తారు. మంచి సినిమా అవుతుంది. అన్నారు.‘‘నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నేను నిర్మాతగా మారతానని ఊహించలేదు. అందులోనూ భానుమతిగారి మనవడు రవిశంకర్‌శాస్త్రిగారితో కలిసి ఈ సినిమా చేయడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నాను. ఇదంతా సుశాంత్‌గారి వల్లే’’ అన్నారు హరీష్‌. దర్శకుడు దర్శన్‌ మాట్లాడుతూ…నా స్నేహితుడి జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఢమరుకం సినిమాకు ఇదే అన్నపూర్ణ స్టూడియోలో సహాయ దర్శకుడిగా పనిచేశాను. ఇప్పుడు ఇక్కడే నా దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. అన్నారు.