టాలీవుడ్‌ హీరోయిన్ మాధవీ లత సంచలన వ్యాఖ్య చేసింది.నచ్చావులే సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి మాధవీలత.. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో  బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుంది. తన ఫేస్ బుక్ పేజీలో చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసి, కలకలం రేపుతోంది.పైగా తాను చచ్చిపోతాననే విషయాన్ని ఫ్రెండ్స్‌తో కూడా చెప్తూ ఉంటానని ఆమె పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అలాంటి పిచ్చి పనులు చేయకండని మాధవికి సూచించారు. ధైర్యంగా ఉండండని ఆమెకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈ హీరోయిన్‌ గురువారం అర్ధరాత్రి తాను మరణిస్తానని పోస్ట్‌ పెట్టింది. ఏదో ఒక రోజు ‘ప్రేమ” సినిమా లో రేవతిలా చచ్చిపోతానని పేర్కొంది.అందులో కూడా తాను ఎపుడు ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ ఆఖరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా పోతది నేను అంతేనేమో. ఎపుడు నన్ను ఏడిపించే 3 విషయాలు.. మైగ్రేన్ తలనొప్పి, జలుబు-జ్వరం, నిద్రలేమి. వీటికోసం మందులు.. మందులంటే నాకు అసహ్యం.దీనిపై నెటిజెన్స్ స్పందిస్తూ.. . బీ పాజిటీవ్ అని, జీవితంలో ఎవరికైనా ఇలంటి కష్టాలు కామన్ అని అంటున్నారు.