నటీనటులు :  నాగ శౌర్య, మెహ్రిన్ పిర్జా, పోసాని, సత్య , సర్గన్ కౌర్, ప్రిన్స్, జిష్షు సేతు తదితరులు

దర్శకత్వం : రమణ తేజ

నిర్మాత‌లు : ఉషా ములుపూరి

సంగీతం :  శ్రీచరణ్ పాకల(సాంగ్స్) జిబ్రాన్(బిజీఎమ్)

సినిమాటోగ్రఫర్ : మనోజ్ రెడ్డి

ఎడిటర్ : గ్యారీ బి హెచ్

కెరీర్లో చాలా వరకు సాఫ్ట్ - లవర్ బాయ్ పాత్రలే చేశాడు నాగశౌర్య. ఇప్పుడతను పూర్తి స్థాయి మాస్ కథతో చేసిన సినిమా ‘అశ్వథ్థామ’. తనే స్వయంగా కథ రాసుకుని సొంత బేనర్లో నాగశౌర్య చేసిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం

కథ: 

నగరంలోని యువతులు మిస్సవడం.. రెండు మూడు రోజులు తర్వాత అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కనిపించడం.. కొన్ని నెలల తర్వాత ఆ యువతులు ప్రెగ్నెంట్‌ కావడం.. చేసింది ఎవరో తెలీదు. కొంత మంది పాత్ర ధారులతో ఓ సూత్రధారి నిర్మించుకున్న పద్మ వ్యూహం లాంటి సామ్రాజ్యంలోకి అశ్వథ్థామ ప్రవేశిస్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్లిన అశ్వథ్థామ చిక్కుకున్నాడా? లేక ఆ వ్యూహాన్ని ఛేదించాడా? శత్రు సంహారం జరిగిందా అనేదే అశ్వథ్థామ కథ.

గణ (నాగశౌర్య)కు కుటుంబం అన్నా తన చెల్లెలు ప్రియ అన్నా ఎంతో ఇష్టం. చెల్లెలు ప్రియ ఎప్పుడు కంటతడి పెట్టకుండా అండగా, ధైర్యంగా ఉంటానని గణ తన తల్లికి చిన్నప్పుడే మాటిస్తాడు. అయితే రవి (ప్రిన్స్‌)తో ప్రియ పెళ్లికి కొద్ది రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడాన్ని గణ చూస్తాడు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని ప్రియకు బాసటగా నిలుస్తాడు. తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్‌లో తెలుసుకుంటాడు. ఇదంతా చేస్తుంది ఎవరు? నేహ (మెహరీన్‌)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?  ఈ కథలోకి డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ (జిష్షు సేన్ గుప్తా), సత్య, పోసాని, తదితరలు ఎందుకు ఎంటర్‌ అవుతారు? చివరికి ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరో గణ తెలుసుకుంటాడా? చివరికి ఏమైంది? అనేదే అసలు సినిమా కథ.

నటీనటులు:

నాగశౌర్య పూర్తి స్థాయి మాస్ పాత్ర చేశాడు ‘అశ్వథ్థామ’లో. ఇంతకుముందు అతణ్ని ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్లలోనే చూసినప్పటికీ.. ఇంతకుముందు ‘జాదూగాడు’లో మాదిరి ఇందులో ఎబ్బెట్టుగా అనిపించలేదు. పాత్రకు ఫిట్ అనిపించాడు. అందుకోసం పర్ఫెక్ట్ లుక్ లోకి మారాడు. చెల్లెలికి జరిగిన అన్యాయానికి లోలోన నరకయాతన అనుభవిస్తూ ప్రతీకారం కోసం ప్రయత్నించే పాత్రలో శౌర్య ఎమోషన్లు బాగా పలికించాడు. పెర్ఫామెన్స్ పరంగా శౌర్యకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పాత్ర సినిమాలో నామమాత్రమే. హీరో చెల్లెలిగా చేసిన అమ్మాయి పర్వాలేదు. విలన్ పాత్రధారి ఆకట్టుకున్నాడు. అతను కొత్తవాడే అయినప్పటికీ పాత్రకు తగ్గ వెయిట్ తీసుకొచ్చాడు. హరీష్ ఉత్తమన్ బాగా చేశాడు. ప్రిన్స్ - సత్య - జయప్రకాష్ - పవిత్ర లోకేష్ - పోసాని.. వీళ్లెవరికీ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు.

విశ్లేష‌ణ‌:

ఒక‌టి ఆరా సినిమాల్లో త‌ప్ప‌.. ఎక్కువ భాగం సినిమాల్లో ల‌వ‌ర్‌బోయ్‌గా క‌న‌ప‌డ్డ హీరో నాగ‌శౌర్య తొలిసారి డిఫ‌రెంట్‌గా చేసిన ప్ర‌య‌త్నం ‘అశ్వ‌థ్థామ‌’. ప్ర‌స్తుతం ఆడ‌పిల్ల‌లపై జ‌రుగుతున్న అత్యాచారాలు అనే కాన్సెప్ట్‌ను తీసుకున్నాడు కానీ.. దానికి ఓ డార్క్ సైక‌లాజిక‌ల్ కాన్సెప్ట్ జోడించి క‌థ‌ను రాసుకున్నాడు. హీరోగానే కాదు.. ర‌చ‌యిత‌గా తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. హీరోగా త‌న లుక్ బావుంది. బాడీకూడా పెంచాడు. సినిమాలో సిక్స్ ప్యాక్ చూపంచ‌లేదు కానీ... సిక్స్ పాక్య్ లుక్ అని చూడ‌గానే మ‌న‌కు అర్థ‌మ‌య్యేలా ఉంది. పెర్ఫామెన్స్ ప‌రంగా త‌ను బాగా చేశాడు. ఇక హీరోయిన్ మెహ్రీన్ గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచిది. పాట‌ల‌కు ప‌రిమిత‌మైంది. త‌న పాత్ర‌లో పెర్ఫామెన్స్‌కు స్కోప్ లేదు. పోసాని చిన్న సీన్‌లో క‌న‌ప‌డిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో ఆ సీన్‌కు ప్రాణం పోశాడు. ప్రిన్స్ కూడా ఉప్పు చ‌ప్ప‌గా ఉండే పాత్ర‌లో క‌న‌ప‌డ్డాడు. ఇక హీరో త‌ల్లిదండ్రులుగా జ‌య‌ప్ర‌కాశ్‌, ప్ర‌గ‌తి కూడా క‌నిపించి క‌న‌ప‌డ‌ని పాత్ర‌ధారుల‌య్యారు. హీరో ఫ్యామిలీ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రీ బోరింగ్‌గా ఎప్పుడా స‌న్నివేశం అయిపోతుందిరా బాబూ అనేలా ఉన్నాయి.

సాంకేతికంగా చూస్తే.. పాట‌లు బాగాలేవు. జిబ్రాన్ నేప‌థ్య సంగీతం ఓకే. మ‌నోజ్ కెమెరా ప‌నిత‌నం బావుంది. ఇక సిస్ట‌ర్ సెంటిమెంట్ అని చెప్పుకున్న ఈ సినిమాలో సినిమాలో ఒక‌ట్రెండు సీన్స్‌లో బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్ స‌న్నివేశాలుంటాయి. అవి కూడా అంత ఎమోష‌న‌ల్‌గా అనిపించ‌వు. ఇక ఫ్యామిలీ సీన్స్ గురించి ఇది వ‌ర‌కే అన్న‌ట్లు చెప్పుకోకుండా ఉంటేనే మంచిది. త‌మిళంలో వ‌చ్చిన నా పేరు త‌ర‌హాలో డార్క్ పాయింట్‌తో స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. ఇక మెయిన్ విల‌న్‌గా న‌టించిన జుస్సుసేన్ గుప్తా న‌ట‌న బావుంది. సైకో విల‌న్‌గా త‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అస‌లు సినిమాలో కిడ్నాప్‌లు ఎవ‌రు? చేయిస్తార‌నేదే కీ పాయింట్ అది ఇంట‌ర్వెల్ త‌ర్వాత రివీల్ అయిపోతుంది.. అది కూడా సైకిక్ విల‌న్ కార‌ణ‌మ‌ని తెలిసిపోతుంది. దాంతో సినిమాలో ఉన్న కిక్ పోతుంది. సినిమాలో ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే అంబులెన్స్ సీన్‌, ఫైట్ మిన‌హా సినిమాలో గొప్ప‌గా చెప్పుకునేంత ఏమీ క‌న‌ప‌డ‌దు.