"చూసి చూడంగానే' చిత్ర బృందం బంజరాహిల్స్‌లో సందడి చేశారు. బ్లష్ ఇంటర్నేషనల్ సెలూన్ అండ్ స్పా సెంటర్ ని పంజాగుట్టలో ప్రారంభించారు. ఈ సందర్భంగా "చూసి చూడంగానే" ఫేమ్ శివ కందుకూరి మాట్లాడుతూ 'బ్లష్ ఇంటర్నేషనల్ సెలూన్ అండ్ స్పా రెండు, మూడో బ్రాంచ్ లను అత్తాపూర్, పంజాగుట్టలో ప్రారంభించడం హ్యాపీగా ఉంది. ఇప్పటికే ఇది బంజారాహిల్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ రెండు చోట్లా కూడా మంచి సర్వీస్ తో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నాడు. హీరోయిన్ మాళవిక సతీష్ మాట్లాడుతూ "బ్లష్ ఇంటర్నేషనల్ సెలూన్ అండ్ స్పా మూడో బ్రాంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సర్వీస్ చాలా హార్ట్ ఫుల్ గా అందిస్తారు. వాటిని ప్రజలు వినియోగించుకోవాలి' అని చెప్పింది. బ్లష్ ఇంటర్నేషనల్ సెలూన్ అండ్ స్పా నిర్వాహకులు నందిని మాట్లాడుతూ "ప్రారంభోత్సవానికి హాజరైన హీరోహీరోయిన్స్ శివకందుకూరి, మాళవికలకు హార్ట్ ఫుల్ థ్యాంక్స్. వారి సినిమా ఇటీవల విడుదలైన చక్కని సక్సెస్ అందుకుంది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ లో బ్లష్ ఇంటర్నేషనల్ సెలూన్ అండ్ స్పా రెండో బ్రాంచ్ ని అత్తాపూర్ లో మూడవ బ్రాంచ్ ని ప్రారంభించడం హ్యాపీగా ఉంది. మొదటి బ్రాంచ్ లాగే ఈ రెండు బ్రాంచ్ లను వినియోగదారులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అన్నారు. ప్రసన్న మాట్లాడుతూ "ఈ ఓపెనింగ్ కి రావడం హ్యాపీ. శివ హీరోగా పరిచయమవుతూ వచ్చిన చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అతని మరిన్ని సినిమాలు చేసి హీరోగా రాణించాలి. బ్లష్ ఇంటర్నేషనల్ సెలూన్ అండ్ స్పా ఇంకా మరిన్ని బ్రాంచ్ లతో విజయపథంలో ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.