బాపట్ల ఎం పి నందిగం సురేష్ సమర్పణలో పెదరావూరు ఫిల్మ్ సిటీ బ్యానర్ పై దిలీప్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'యూత్'  .కుర్రాళ్ళ గుండె చప్పుడు ఉప శీర్షిక. ఈ చిత్రం యొక్క టైటిల్  అనౌన్స్ మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ... ఇది వరకు నేను అలీ గారితో 'పండుగాడి ఫోటో స్టూడియో'  సినిమాను చేసాను. సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఆ స్పూర్తితో నే ఇప్పుడు యూత్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. దీనికి కుర్రాళ్ళ గుండె చప్పుడు అనేది ఉప శీర్షిక. నా ముందు సినిమా కూడా నా బలం, నా ధైర్యం నా స్ఫూర్తి,నా శ్రేయోభిలాషి అయిన  సుకుమార్ గారు స్టోరీ విని ఒకే అంటేనే ప్రాజెక్ట్ పట్టాలెక్కింది ప్రేక్షకులచే ఆదరించబడింది. అలానే ఇపుడు ఈ యూత్ చిత్రం కూడా అతను విని బాగుంది అంటేనే మొదలు కానుంది.  ఇక సినిమా విషయానికి వస్తే..  ఒక 22 ఏళ్ల కుర్రాడు కోర్టును మెర్సీ కిల్లింగ్ ను అడుగుతాడు అందుకు ఆ జడ్జ్ ఎందుకు అని అడిగితే ఆ కుర్రాడు నేటి సమాజం లో కుర్రాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో.. ఎలాంటి బాధలను భరిస్తున్నాడో తెలియచెబుతాడు.. అదే ఈ చిత్ర కాన్సెప్ట్. ప్రతి ఒక్క కుర్రాడు ఈ కాన్సెప్ట్ కు కనెక్ట్ అవుతాడు. తమ లైఫ్ లో ఇలానే జరుగుతోందని భావిస్తాడు. ఈ చిత్రాన్ని బాపట్ల 
ఎం పి నందిగం  సురేష్ గారు ఈ చిత్రాన్ని సమర్పించనున్నారు .అందుకు ఆయనకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నా... ఇక ఈ చిత్రం పెనుమూడి, తెనాలి, నిజాం పట్నం హార్బర్, భీమిలి బీచ్, అరకు లోయ, సూర్య లంక తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్నాము.. మార్చి నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టి జూన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇందులో లీడ్ రోల్ ధన్య బాలకృష్ణ నటించనుంది. అలానే వెన్నెల తో పాటు హిందీ నుండి ఇద్దరు ప్రముఖ నటులు, ఆలోక్ జైన్ విలన్ పాత్రలో, తమిళ్ నుండి మరో ఇద్దరు ప్రముఖ నటులు నటించనున్నారు.  మంచి కాన్సెప్ట్ తో వచ్చే ఈ సినిమాను ఆదరించమని, అలానే చిన్న సినిమాలు వెంటిలేటర్ మీద ఉన్నాయి వాటిని బ్రతికించమని తెలుగు రాష్ట్రల వారిని కోరుకుంటున్నాను అన్నారు. 

సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ... దిలీప్ రాజా గారి దర్శకత్వంలో నేను చేస్తున్న రెండవ సినిమా ఇది. కాన్సెప్ట్ చాలా బాగుంది. ప్రస్తుతం  పాటలకు సంబంధించిన ట్యూన్స్ రెడీ 
అయ్యాయని చెప్పారు.

హీరోయిన్ రావత్ సింధు మాట్లాడుతూ.. నా పాత్ర ఈ సినిమాలో చాలా బాగుంది. ఈ సినిమాతో నాకు బ్రేక్ వస్తుందని నమ్ముతున్నాను. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుందని తెలియచేశారు. 

సబ్జెక్ట్ విని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, యూత్ కు ఏం కావాలో అన్నీ ఈ సినిమాలో ఉండనున్నాయి.  పండుగాడి ఫోటో స్టూడియో సినిమా తరువాత దిలీప్ రాజా దర్శకత్వంలో  నేను చేస్తున్న సినిమా ఇది.  మంచి పాత్ర లభించిందని నటుడు జబర్దస్త్ ఫణి తెలిపారు. 

ధన్య బాలకృష్ణ, రావత్ సింధు, వెన్నెల, ఆలోక్ జైన్ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: యాజమాన్య, డిఓపి: మల్లికార్జున్( రేయ్, 
మహం కాళీ, బాలకృష్ణ నటించిన ఒకే ఒక్కడు ఫేమ్), ఫైట్స్: జాషువా, ( ఖైదీ నెం వ్150, సాహో ఫేం), ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్సకత్వం: దిలీప్ రాజా.