ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ - ‘‘ముందు ఈ సినిమాను క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ ప్రేమ్‌కి థాంక్స్‌. అంద‌రూ అద్భుత‌మైన ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చే న‌టీన‌టులనే ఎంచుకున్నారు. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’, ‘అల‌వైకుంఠ‌పుర‌ములో’ ఇప్పుడు ‘జాను’తో ఈ ఏడాది అప్పుడే దిల్‌రాజుగారు హ్యాట్రిక్ కొట్టారు. ‘జాను’ చాలా అంద‌మైన ల‌వ్‌స్టోరీ ఇదే. క్లైమాక్స్‌ చూడ‌గానే కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను చూసిన ‘గీతాంజ‌లి’, నేను డైరెక్ట్ చేసిన ‘ప‌ద‌హారేళ్ళ వ‌య‌సు` సినిమాల క్లైమాక్స్ చూసిన త‌ర్వాత శ‌ర్వా, స‌మంతల జాను అంతలా క‌దిలించింది’’ అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘మా డైరెక్ట‌ర్ ప్రేమ్‌, ఇత‌ర టెక్నీషియ‌న్స్‌కీ థాంక్స్‌. అలాగే హీరో, హీరోయిన్ అన‌డం బెస్ట్ పెర్ఫామ‌ర్స్ అయిన శ‌ర్వానంద్‌, స‌మంత‌కు థాంక్స్‌. వారిద్ద‌రూ క‌ళ్ల‌తోనే న‌టించారు. అలాగే ఈ సినిమాలో న‌టించిన ఇత‌ర తారాగ‌ణానికి కూడా ధ‌న్య‌వాదాలు. తొలిరోజు నుండి ఇటు ఇండ‌స్ట్రీ నుండి అటు మీడియా, సోష‌ల్ మీడియా, ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. ‘96’ సినిమా చూసిన తర్వాత తెలుగులో సినిమాను తీద్దామని అనుకున్నప్పుడు అప్‌క‌మింగ్ రైట‌ర్స్ కావాల‌నుకున్న‌ప్పుడు మా హ‌రిగారు మిర్చి కిర‌ణ్‌ని ఇంట్ర‌డ్యూస్ చేశారు. త‌ను చ‌క్క‌గా రాశారు. సినిమాను రీమేక్ చేస్తున్నామని అన్నప్పుడు చెడగొట్టేస్తారని, మేజిక్ రిపీట్ కాదని అన్నారు. కానీ ఇప్పుడు సినిమా చాలా బావుంద‌ని అంటున్నారు. తెలిసిన వారికి సినిమా చూడ‌మ‌ని చెబుతున్నారు. ఫ్యామిలీ అంతా చూసే చిత్ర‌మిది. మా బ్యాన‌ర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెబుతున్నారు. సినిమా చూసిన ప్రేక్ష‌కులు క‌న్నీళ్ల రూపంలో వాళ్లేం చూశారో దాన్ని చెబుతున్నారు. సాధార‌ణంగా సినిమాలు తీసేట‌ప్పుడు లెక్క‌లు వేసుకుంటాను. కానీ ‘జాను’ సినిమాను తీయాల‌నుకున్న‌ప్పుడు నేను లెక్క‌లు వేసుకోలేదు. ఇలాంటి సినిమాను చూసి ఎంక‌రేజ్ చేసిన‌ప్పుడు మ‌రిన్ని మంచి సినిమాలు చేయ‌గ‌లం’’ అన్నారు. 

స‌మంత అక్కినేని మాట్లాడుతూ - ‘‘సినిమాను చూసిన వారంద‌రూ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. మంచి ఎక్స్‌పీరియెన్స్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను’’ అన్నారు. 

హీరో శర్వానంద్ మాట్లాడుతూ - ‘‘ఎన్నో హిట్ సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. ‘గీతాంజ‌లి’, ‘ప‌ద‌హారేళ్ళ వ‌య‌సు’ వంటి గొప్ప సినిమాల‌తో మా సినిమాను, గొప్ప న‌టుల‌తో మ‌మ్మ‌ల్ని రాఘ‌వేంద్ర‌రావుగారు పోల్చ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. చాలా రోజులుగా హిట్స్ కొడుతున్నాం. కానీ... న‌టుడిగా ఏదో మిస్ అయ్యామ‌నే భావ‌న మ‌న‌సులో ఉండిపోయింది. అది ’జాను’ తీరింది. ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా మంచి కోరే వ్య‌క్తుల్లో ముందుండే వ్య‌క్తి రాజ‌న్న‌. చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు థాంక్స్‌. న‌న్ను మంచి యాక్ట‌ర్ అని ఇప్పుడు పిలుస్తున్నారంటే ముందు మా డైరెక్ట‌ర్‌కే క్రెడిట్ ఇవ్వాలి. న‌న్ను రామ‌చంద్ర‌గా అద్భుతంగా మ‌లిచారు. అలాగే స‌మంత‌కు కూడా స‌గం క్రెడిట్ ఇస్తాను. నేను, స‌మంత తొలిరోజు నుండి జాను, రామ‌చంద్ర‌గా బెస్ట్ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించాం. ఆ స్కిప్ట్ మ‌మ్న‌ల్ని అలా చేయించింది. మా అమ్మ‌గారు, ఆవిడ స్నేహితుల‌తో క‌లిసి ఈ సినిమాను చూసి ఇంటికొచ్చి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇంత బాగా వీళ్లు సినిమాకు క‌నెక్ట్ అయ్యారా? అని ఆనంద‌మేసింది. క్లాసిక్‌, మంచి సినిమాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు.. మీరే ఎంక‌రేజ్ చేయాలి’’ అన్నారు. 

బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ - ‘‘రాజుగారు చేసిన సినిమాల్లో స‌మ‌స్య‌ల నుండి ఉద్భ‌వించారు. ‘ఆర్య’ నుండి ఇప్ప‌టి ‘జాను’ వ‌ర‌కు చాలా ఇష్ట‌ప‌డి సినిమాలు తీశారు. ‘శ‌త‌మానం భ‌వ‌తి’ స‌మయంలో నేనైతే ‘ఆ టైటిల్‌, సినిమా ఏంటి సార్‌?’ అని కూడా అన్నాను. ఎంతో ప్రేమించి సినిమా తీసి హిట్ కొట్టారు. అదే పాజిటివ్ దృక్ప‌థంతో శ‌ర్వా, స‌మంత‌ను ఒప్పించి ‘జాను’ సినిమా చేశారు. ప్రేమించిన ప్ర‌తివారు అర్థం చేసుకునే వ‌ర‌కు ఎదుటివారికి చెప్పండ‌ని ఈ సినిమాతో అర్థం చేసుకోవాలి. శ‌ర్వా, స‌మంత ఎలాంటి హోంవ‌ర్క్ చేశారో అని సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. క‌మ్యూనికేష‌న్ గ్యాప్‌ను క్లియ‌ర్ చేసే సినిమా ఇది’’ అన్నారు. 

నందినీ రెడ్డి మాట్లాడుతూ - ‘‘‘96’ సినిమా చూసినప్పుడు ఎవ‌రి జీవితంలోనో వెళ్లి చూసిన అనుభూతి క‌లిగింది. దిల్‌రాజుగారు ఎమోష‌న‌ల్‌గా ఫీలై, లెక్క‌లు వేయ‌కుండా ధైర్యంతో, ప్యాష‌న్‌తో చేసిన సినిమా ఇది. శ‌ర్వానంద్‌, స‌మంత అంత ప‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. డైరెక్ట‌ర్ ప్రేమ్‌గారికి ఈ సంద‌ర్భంగా థాంక్స్‌. శ‌ర్వా టాలెంట్‌కి త‌గ్గ స్క్రిప్ట్ రాయ‌లేక‌పోయామే అని ఇప్పుడు అనిపిస్తుంది. అత‌ని టాలెంట్‌కు స‌రిప‌డే క‌థ ఇది. స‌మంత‌.. పెర్ఫామెన్స్ చూసిన త‌ర్వాత ఫోన్ చేస్తూ ఏడ్చేశాను. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు. కొన్ని త‌రాలు నిలిచిపోయే సినిమా ఇది. జాను ఎక్స్‌పీరియెన్స్‌ను ఎంజాయ్ చేయాల్సిందే’’ అన్నారు. 

పాట‌ల ర‌చ‌యిత శ్రీమ‌ణి మాట్లాడుతూ - ‘‘ఇష్ట‌మైన ప‌నికి పడ్డ క‌ష్టం కాబ‌ట్టి చాలా సంతోషంగానే అనిపించింది. డైరెక్ట‌ర్ ప్రేమ్‌గారు పాట‌లు లేకుండా మొత్తం సినిమాను నాకు చూపించారు. ‘96’ సినిమాను నేను త‌మిళంలో తొలిరోజునే చూశాను. అప్పుడు నేను ఎలా ఫీల‌య్యానో, ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో తెలుగులో జానుని చూసిన‌ప్పుడు అలాగే ఫీల‌య్యాను. శ‌ర్వా, స‌మంత‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామెన్స్ ఇచ్చారు. త‌మిళంలో కంటే తెలుగులో కొత్త సాంగ్స్‌గా చేశాం. ట్రాన్స్‌లేషన్స్ చేయ‌డానికి వీలు కాకుండా కొత్త ఎమోష‌న్స్‌ను యాడ్ చేశారు. డైరెక్ట‌ర్ ప్రేమ్‌గారు, దిల్‌రాజుగారు అందించిన స‌పోర్ట్‌తోనే మంచి ఔట్‌పుట్ ఇవ్వ‌గ‌లిగాను. గోవింద్ వ‌సంత‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు’’ అన్నారు. 

మిర్చి కిర‌ణ్ మాట్లాడుతూ - ‘‘గ‌తానికి, ప్ర‌స్తుతానికి మ‌ధ్య ఓ వార‌ధిలాంటి సినిమా ఇది. మాటల్లో చెప్ప‌లేని ఫీలింగ్‌ను ఇచ్చే ల‌వ్‌స్టోరీ ఇది. టైమ్ మిష‌న్‌లో ట్రావెల్ చేసి మ‌న గ‌తానికి వెళ్లినట్లు అనిపిస్తుంది’’ అన్నారు.