'రొమాంటిక్' మూవీతో తనయుడు ఆకాష్ పూరి కి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. సినిమా ప్రొడక్షన్ స్టార్టయిన దగ్గర్నుంచి మంచి ప్రచార వ్యూహాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని సైతం తనదైన శైలిలో అనౌన్స్ చేశారు.
మే 29న ప్రపంచవ్యాప్తంగా 'రొమాంటిక్'ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ లో మంచి వినోదంతో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లకు ఈ సినిమా అలాంటి కాలక్షేపాన్ని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది. హీరోయిన్ కేతికా శర్మతో హీరో ఆకాష్ లిప్ లాక్ చేస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ మూవీని అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రెండు పాటలూ సంగీత ప్రియులను అలరిస్తూ చార్ట్ బస్టర్స్ గా పేరు తెచ్చుకున్నాయి. నరేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తారాగణం:
ఆకాష్ పూరి, కేతికా శర్మ, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునయన

సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: పూరి జగన్నాథ్
డైరెక్టర్: అనిల్ పాడూరి
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్
సమర్పణ: లావణ్య
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: నరేష్
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి
ఆర్ట్: జానీ షేక్
పాటలు: భాస్కరభట్ల
ఫైట్స్: రియల్ సతీష్

బ్యానర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్