కింగ్ నాగార్జున – రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్ గా రూపొందతున్న చిత్రం ‘మన్మథుడు 2’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి పాత్రల పరిచయానికి రంగం సిద్ధం అయింది. ఈ సినిమాలో అవంతికగా నటిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ పాత్రను ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు పరిచయం చేయబోతున్నామని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందని.. ప్రత్యేకించి నాగ్ కామెడీ టైమింగ్ సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నాగ్ పాత్రను బాగా తీర్చిదిద్దారట. మరి ‘మన్మథుడు 2’, కామెడీలో ‘మన్మథుడు’ మించిపోతాడేమో చూడాలి.

ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.