నటీనటులు :నితిన్రష్మిక మండన, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్ తదితరులు.

దర్శకత్వం : వెంకీ కుడుముల

నిర్మాత‌లు : సూర్యదేవర నాగ వంశి

సంగీతం మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీరామ్


కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ కథానాయకుడు నితిన్. గత రెండు మూడేళ్లుగా అతడికి హిట్టే లేదు. హ్యాట్రిక్ ఫ్లాపులతో రేసులో వెనుకబడిపోయాడు. దీంతో ఈసారి కొంచెం బ్రేక్ తీసుకుని ఆచితూచి చేసిన సినిమాభీష్మ’. ‘ఛలోలాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల రూపొందించిన చిత్రమిది. రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమైనా నితిన్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా ఉందో లేదో చూద్దాం పదండి.


కథ:


భీష్మ(నితిన్) డిగ్రీ తప్పిన కుర్రాడు. మీమ్స్ చేసుకుంటూ ఉంటాడు. అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండదు. సమయంలో అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ దేవా(సంపత్) కూతురు ఛైత్ర(రష్మిక మందన్న)ని ప్రేమిస్తాడు. ఆమె భీష్మ ఆర్గానిక్ ఫార్మ్ కంపెనీలో పని చేస్తుంటుంది. కంపెనీ యజమాని పేరు కూడా భీష్మ(అనంత్ నాగ్). తన మంచితనంతో భీష్మ(నితిన్), ఛైత్ర మనసుని గెలుస్తాడు. కానీ దేవాకి భీష్మ తండ్రి అంటే పడదు. దాంతో వారి పెళ్లికి ఒప్పుకోడు. అప్పుడు భీష్మ తండ్రి(నరేష్).. తన కొడుకు భీష్మ ఆర్గానిక్ వ్యవసాయ కంపెనీకి కాబోయే చైర్మన్ అని చెబుతాడు. అదే సమయంలో భీష్మను నెల రోజుల పాటు భీష్మ ఆర్గానిక్ ఫార్మ్ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తారు. అసలు భీష్మ ఎవరుఅతనికి, భీష్మ ఆర్గానిక్ వ్యవసాయ కంపెనీ ఉన్న సంబంధం ఏంటి? సీఈవోగా భీష్మ.. కంపెనీ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తాడు? రసాయనాలు వాడుతూ వ్యవసాయం చేయాలంటూ ప్రొడక్ట్‌ను కనిపెట్టిన మరో కంపెనీ యజమాని రాజన్(జిస్సేన్ గుప్తా)ను భీష్మ ఎలా అడ్డుకుంటాడుతన ప్రేమను ఎలా గెలుచుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే


విశ్లేషణ:


సినిమా కథ మొత్తం భీష్మ (నితిన్‌, అనంత్‌ నాగ్‌, ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీ) చుట్టే తిరుగుతుంది. అనుకున్న కథ ఎక్కడా డీవియేట్‌ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా చిత్రాన్ని తెరకెక్కించాడు. అతడు చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్‌ చేశాడు. విషయంలో అతడికి నూటికి నూరు మార్కులు పడతాయి. అనంత్‌ నాగ్‌ ఆర్గానిక్‌ వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే స్పీచ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. వెంటనే హీరో సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడ తగ్గకుండా, కథ పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుంది. హీరోయిన్‌ ఎంట్రీ, వెన్నెల కిశోర్‌, సంపత్‌, నరేశ్‌, నితిన్‌, బ్రహ్మాజీల కామెడీ, నితిన్‌, రష్మికల మధ్య వచ్చే సీన్లతో ఫస్టాఫ్‌ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది


ఇక సెకండాఫ్‌ కామెడీతోనే మొదలవుతుంది. తర్వాత అనూహ్య మలుపులు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్‌ అవుతాయి. ముఖ్యంగా రెండో అర్థభాగం ఆర్గానికి వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా బోర్‌ కొట్టదు. వ్యవసాయానికి శృతి మించని ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించడం బాగుంటుంది. ఇక కొన్ని పంచ్‌ డైలాగ్‌లు వావ్‌ అనిపించేలా ఉంటాయి. ఇక సినిమాలో హీరో అంతగా చదువుకోలేదు.. డబ్బులు ఉన్నవాడు కాదు.. కానీ అనుకున్నది సాధిస్తాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఆశయం గొప్పదయితే ప్రకృతే మనకు అదృష్టంగా మారి మన విజయానికి సహకరిస్తుందనిభీష్మసినిమాతో మరోసారి రుజువైంది.


ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వర సాగర్‌ అందించిన పాటలు ఎంతటి హిట్‌ సాధించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. సింగర్స్‌, లిరక్‌ రైటర్స్‌ తమ వంతు న్యాయం చేశారు. స్క్రీన్‌ప్లే గజిబిజీగా కాకుండా క్లీన్‌గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాయి శ్రీరామ్‌ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ఖర్చు నిర్మాత నాగవంశీ ఖర్చు చేసినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. దర్శకుడి ప్రతిభ, ఆకట్టుకునే నటీనటులు నటన, అలరించే సంగీతం ఇలా అన్నీ కలబోసి వచ్చిన చిత్రంభీష్మ’ . పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.. పైసా వసూల్‌ చిత్రం.