బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న 'భీష్మ'లో చిన్న భాగం కావడం గర్వంగా ఉందని అంటున్నారు వర్ధమాన సహాయ నటుడు అప్పాజీ అంబరీష. 'మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, గద్దలకొండ' గణేష్ వంటి బ్లాక్ బస్టర్స్ లో ముఖ్యపాత్రలలో నటించి మెప్పించిన అప్పాజీ.. తను ఓ చిన్న పాత్ర పోషించిన 'భీష్మ' భారీ విజయం సాధించే దిశగా దూసుకుపోతుండడం సంతోషాన్నిస్తోందని అంటున్నారు.   దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత నాగదేవర సూర్యవంశీ, కో-డైరెక్టర్ శ్రీవాస్తవ్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అప్పాజీ ప్రస్తుతం 'డర్టీ హరి, విఠల్ వాడి, నాట్యం, కాదల్, తాగితే తందానా, అభిలాష, నేడే విడుదల' చిత్రాలతో పాటు పేరు పెట్టని మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుహాసిని, భానుప్రియ, తులసి, సురేఖా వాణి, మిర్చి మాధవి, కల్పలత, జయశ్రీ రాచకొండ వంటి ప్రముఖ నటీమణులకు జంటగా నటిస్తున్నారు. ముఖ్యంగా.. అప్పాజీ అంబరీష ఇటీవలే.. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'కె.జి.ఎఫ్-చాప్టర్2'లో కూడా నటించడం విశేషం!!