బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేస్తున్న మూడో సినిమా, ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న అత్యంత ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ ఈ రోజు, మార్చ్ 2 ఉదయం ఆర్ ఎఫ్ సి లో మొదలయింది. నటసింహ బాలకృష్ణ పాల్గొనగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ చిత్రీకరణతో దర్శకులు బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు.  ఈ షెడ్యూల్ ఏకధాటిగా జరుగుతుంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం,  ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ఫుల్ గా మంచి కథా బలం తో పాటుగా చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'బాలయ్య బోయపాటి 3' కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్ మాస్టర్స్: రామ్ - లక్ష్మణ్, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.