వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న హీరోయిన్ రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?’. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతుంది. న్యూ ఏజ్ ఫిలిమ్ మేక‌ర్‌గా  తొలి చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే` సినిమాతో సూప‌ర్‌హిట్ సాధించి తన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై  నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఇనుప చువ్వ‌ల మ‌ద్య బంధీగా ఉన్న మ‌హారాణి పాత్ర‌ధారిగా రెజీనా క‌సండ్ర లుక్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా...

యాపిల్ ట్రీ స్టూడియోస్ అధినేత‌, నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ మాట్లాడుతూ - ``మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘నేనే నా..?’ సినిమాను కార్తీక్ రాజుగారు అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈరోజు వ‌రుణ్‌తేజ్‌గారు మా సినిమాలోని రెజీనాగారి లుక్‌ను విడుద‌ల చేశారు. ఆయ‌నకు మా యూనిట్ త‌ర‌పున స్పెష‌ల్ థాంక్స్‌. రెజీనా లుక్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.  శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా క‌న‌ప‌డ‌తారు. న‌టిగా ఆమెను మ‌రో యాంగిల్‌లో ఆవిష్క‌రిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఆమె స్పెష‌ల్‌గా ట్రైనింగ్ తీసుకుని యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టిస్తున్నారు’’ అన్నారు. 

ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతాన్ని.. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.