యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...`.  అనూప్‌ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడుద‌లైన `కురిసెన.. కురిసెన..`పాట‌కి ట్రెమండ‌స్ రెస్పాన్ వ‌స్తోంది. మార్చి4(బుద‌వారం) సాయంత్రం 5.04నిమిషాల‌కు ఈ చిత్ర టీజ‌ర్ ను ప‌వ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ వ‌న్ మిలియ‌న్ కి పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ``మా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ టీజ‌ర్‌ను విడుద‌ల‌చేసిన హ‌రీష్ శంక‌ర్ గారికి ధ‌న్య‌వాదాలు. ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ కి పైగా వ్యూస్  ద‌క్కించుకోవ‌డం సంతోషంగా ఉంది. మా ద‌ర్శ‌కుడు విజయ్‌కుమార్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునేలా మంచి విజ‌న్ తో ఈ చిత్రాన్నితెర‌కెక్కించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నాం.  యూత్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా..’మా బేనర్‌లో డెఫినెట్‌గా మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది’’ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.