Home Movie News ఏబిసిడీ ట్రైలర్ ఎలా ఉందంటే…

ఏబిసిడీ ట్రైలర్ ఎలా ఉందంటే…

0
SHARE
ABCD Trailer | telugu.itsmajja.com

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఏబిసిడీ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను ఆ మధ్య విడుదల చేశారు. సిడ్ శ్రీరామ్ పాడిన మెల్ల మెల్లగా అంటూ సాగే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందా అనే అంచనాలు కాస్త ఏర్పడ్డాయి. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందంటే…

ట్రైలర్ కాస్త ఇంట్రస్టింగ్ గా నే ఉంది. బాగా డబ్బున్న కుర్రాడు.. డబ్బు లేనివాడిగా బతికితే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన కుర్రాడి జీవితం ఇది. దీనికి రాజకీయాల్ని, ప్రేమను, స్నేహాన్ని కూడా జోడించాడు దర్శకుడు సంజయ్. ఇది రీమేక్ సినిమా. కానీ తెలుగు నేటివిటీ, హీరో కు తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. ఏది ఏమైనా ఏబిసిడీ ట్రైలర్ బాగానే ఉంది. ఏదో ఓ విషయాన్ని ఎంటర్ టైనింగ్ వేలో చెప్పబోతున్నారనే ఫీలింగ్ మాత్రం కలిగించగలిగారు.

ఓ మంచి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ కు ఏబిసిడీ హిట్ తెస్తుందా లేదా అన్నది చూడాలి. రుక్సార్ ఇందులో హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ స్నేహితుడిగా నటించాడు. నాగబాబు ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. కామెడీ పార్ట్ ని వెన్నెల కిషోర్ ఎత్తుకున్నాడు. మధుర శ్రీధర్, బిగ్ బెన్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే  ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here